Ravanasura మార్చి 15న థర్డ్ సింగిల్

Monday,March 13,2023 - 07:06 by Z_CLU

Mass Maharaja Ravi Teja, Third Single Veyyinokka Jillala Varaku On March 15th

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు.

హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని మూడవ సింగిల్- వెయ్యినొక్క జిల్లాల వరకు లిరికల్ వీడియో మార్చి 15న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇది రెట్రో నేపథ్య పాట అని సూచిస్తుంది. రవితేజ, మేఘా ఆకాష్ ఇద్దరూ స్కూటర్‌పై కూర్చొని రెట్రో కాస్ట్యూమ్స్‌లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.

విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా యూనిక్ కథను అందించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్.ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics