Ugadi Special - ఏటా టాలీవుడ్ లో ఉగాది సంబరం

Wednesday,March 22,2023 - 07:54 by Z_CLU

Special Story – Ugadi Releases in Tollywood

టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కు ఉన్నంత ఇంపార్టెన్స్ మరే ఇతర పండక్కి ఉండదు. కానీ ఏ చిన్న అకేషన్ ను మిస్ చేసుకోదు ఇండస్ట్రీ. ఉగాది కూడా అలాంటిదే. తెలుగు న్యూ ఇయర్ కి క్రేజీ సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టిన ట్రాక్ రికార్డ్ టాలీవుడ్ కు ఉంది. గడిచిన నాలుగేళ్లుగా ఈ ట్రెండ్ నడుస్తోంది

Majili

2019 ఉగాదికి నాగచైతన్య నటించిన మజిలీ సినిమా వచ్చింది. పెద్ద హిట్టయింది. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలా ఆ ఏడాది నాగచైతన్యతో పాటు టాలీవుడ్ మొత్తం ఉగాదిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. 2020లో మాత్రం ఉగాదిని మిస్సయింది టాలీవుడ్. కరోనా వల్ల థియేట్రికల్ సిస్టమ్ దెబ్బతినడంతో, ఉగాదిని స్కిప్ కొట్టాల్సి వచ్చింది.

vakeel-saab-11

తిరిగి 2021 నుంచి ఉగాది సెంటిమెంట్ టాలీవుడ్ లో కొనసాగుతోంది. ఆ ఏడాది ఉగాది కానుకగా వకీల్ సాబ్ సినిమా వచ్చింది. పవర్ స్టార్ రీఎంట్రీ మూవీగా వచ్చిన వకీల్ సాబ్, బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. పవన్ స్టామినాను మరోసారి ఎలివేట్ చేసింది.

RRR working Stills

ఇక 2022 ఉగాదికి అతిపెద్ద సినిమా ఆర్ఆర్ఆర్ వచ్చింది. చరణ్-తారక్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఆర్ఆర్ఆర్ మూవీ. అలా 2022 ఉగాది టాలీవుడ్ కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

das ka dhamki

ఇక ఈ ఏడాది ఉగాదికి పెద్ద సినిమాల సందడి లేకపోయినా, రెండు సినిమాలు ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. కృష్ణవంశీ తీసిన రంగమార్తాండ, అన్నీ తానై విశ్వక్ సేన్ చేసిన ధమ్కీ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటి రిజల్ట్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ఇలా టాలీవుడ్ లో ప్రతి ఉగాదికి ఓ హిట్ పడుతోంది. మరి ఈ ఏడాది ఆ క్రెడిట్ ను రంగమార్తాండ దక్కించుకుంటుందా లేక ధమ్కీ మూవీ దక్కించుకుంటుందో చూడాలి.