మహేష్ ఆటిట్యూడ్ కి ఫిదా...

Friday,June 09,2017 - 05:06 by Z_CLU

మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘స్పైడర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంటుంది. ప్రస్తుతం క్లైమాక్స్ కి చేరుకున్న ఈ సినిమా గురించి మహేష్ గురించి లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మురుగదాస్.

 

ప్రస్తుతం ఓ పది రోజుల షూటింగ్, రెండు సాంగ్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని , షూటింగ్ పూర్తవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని, ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ తన పర్ఫార్మెన్స్ తో అందరినీ థ్రిల్ చేస్తాడని చెప్పాడు ..


అంతే కాదు అంత స్టార్ డం ఉన్నప్పటికీ మహేష్ సెట్ లో అందరితో చాలా సరదాగా ఉంటారని అందరితో కలిసిపోయి వర్క్ చేసాడని నిజంగా అంతటి స్టార్ హీరో షూటింగ్ లో అలాంటి ఆటిట్యూడ్ తో ఉంటాడని అస్సలు ఊహించలేదని, చాలా డౌన్ టు ఎర్త్ అంటూ మహేష్ గురించి చెప్పిన స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సూపర్ స్టార్ ఆటిట్యూడ్ సూపర్ అంటూ కితాబిచ్చాడు…