బాలయ్య సినిమా ఫస్ట్ లుక్

Friday,June 09,2017 - 05:22 by Z_CLU

బాలయ్య 101 సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజైంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, బాలకృష్ణ కాంబినేషన్ అనగానే క్రియేట్ అయిన క్రేజ్ ఈ సినిమాపై రోజు రోజుకి ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ చేసేస్తుంది. ఫలితంగా ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఏదైతేనేం సినిమా యూనిట్ ముందుగానే అనౌన్స్ చేసినట్టు ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.

ఇంతకుముందు ‘ఉస్తాద్’ ‘జై బాలయ్య’ లాంటి టైటిల్స్ వినిపించినా చివరికి ‘ పైసా వసూల్’ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ లా కనిపించనున్నాడు. శ్రియ శరణ్, ముస్కాన్ హీరోయిన్లు. నటసింహానికి ఇది 101వ సినిమా. సెప్టెంబర్ 27న ‘పైసా వసూల్’ మూవీని విడుదల చేయబోతున్నారు.