నాని సరసన మేఘా ఆకాష్...?

Saturday,January 19,2019 - 10:03 by Z_CLU

త్వరలో విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సెట్స్ పైకి రానున్నాడు నాని. అయితే ఈ సినిమాలో నాని సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ ఫిక్సయిందా…? ప్రస్తుతానికి సినిమా యూనిట్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ కాస్త గట్టిగానే చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో నాని సరసన ఏకంగా 6 గురు హీరోయిన్స్ నటించనున్నారు. ఈ పాయింట్ కొన్ని కొత్త క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నా, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది కాబట్టే, ఇంతమంది హీరోయిన్స్ ఉండబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ ఆరుగురిని ఎంపిక చేసుకునే ప్రాసెస్ లో ఉన్న మేకర్స్, ఒక క్యారెక్టర్ కి మేఘా ఆకాష్ అయితే బెటరనే ఆలోచనలో ఉన్నట్టున్నారు.

ఇది జస్ట్ గాసిపా..? లేకపోతే నిజంగానే మేఘా ఆకాష్ ఈ సినిమాలో నటించనుందా..?అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. నాని అటు ‘జెర్సీ’ కి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న విక్రమ్ & టీమ్, త్వరలోనే ఈ సినిమా హీరోయిన్స్ తో పాటు, తక్కిన టెక్నీషియన్స్ ని కూడా ఫైనలైజ్ చేసుకుని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనుందీ సినిమా.