గ్యాంగ్ లీడర్ టీజర్.. కామెడీ రివెంజ్ డ్రామా

Wednesday,July 24,2019 - 11:55 by Z_CLU

హారర్ సినిమాలు చూశాం.. హారర్ లో కామెడీ సినిమాలు చూశాం
రొమాంటిక్ సినిమాలు చూశాం.. రొమాన్స్ లో కామెడీ చూశాం
రివెంజ్ డ్రామాలు కూడా చూశాం.. మరి రివెంజ్ లో కామెడీ చూశారా..?
సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో వస్తోంది గ్యాంగ్ లీడర్ సినిమా. ఈరోజు రిలీజైన ఈ సినిమా టీజర్, మూవీ జానర్ ను ఆడియన్స్ కు పరిచయం చేసింది. అవును.. కంప్లీట్ కామెడీ రివెంజ్ డ్రామాగా తెరకెక్కింది గ్యాంగ్ లీడర్

నాని ఓ రైటర్. అతడి కలంపేరు పెన్సిల్. అతడి దగ్గరకు ఐదుగురు లేడీస్ వస్తారు. 70 ఏళ్ల బామ్మ నుంచి ఆరేళ్ల చిన్నారి వరకు అన్ని వయసుల వాళ్లు అందులో ఉంటారు. వాళ్లకు ఒకడు అన్యాయం చేస్తాడు. అతడ్ని చంపడానికి, ఆ ఐదుగురుకు నాని హెల్ప్ చేస్తాడు. చూడ్డానికి ఇదో పెద్ద రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కానీ దాన్ని సీరియస్ గా కాకుండా సరదాగా చూపించారు

ఈ ఐదుగురి గ్యాంగ్ కు నాని లీడర్ కాబట్టి ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే నేచురల్ స్టార్ అనిపించుకున్న నాని, టీజర్ లో మరింత నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఓ బేబీతో ఆకట్టుకున్న లక్ష్మి, ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారనే విషయం టీజర్ చూస్తేనే తెలుస్తోంది. వీళ్లతో పాటు కీలక పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. విలన్ క్యారెక్టర్ తప్ప.

సినిమాలో నెగెటివ్ రోల్ పోషించిన కార్తికేయను వెనక నుంచి మాత్రమే చూపించారు. మూవీలో అతడు కారు రేసర్ గా కనిపిస్తున్నాడు. టీజర్ కు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.