నాని కరియర్ లోనే ఫస్ట్ టైమ్

Wednesday,July 17,2019 - 11:33 by Z_CLU

గత కొన్ని సినిమాలుగా బౌండరీలు దాటేస్తున్నాడు న్యాచురల్ స్టార్. ‘జెర్సీ’ లో ఫాదర్ గా కనిపించాడు. ఇప్పటి వరకు కరియర్ లో పట్టని క్రికెట్ బ్యాట్ ని ఈ సినిమా కోసం పట్టాడు. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ తో ఇప్పటి వరకు చేయని జోనర్ లో కనిపించబోతున్నాడు నాని.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘గ్యాంగ్ లీడర్’ లో డిఫెరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. లుక్స్ చూస్తేనే గత సినిమాలకి ఈ సినిమాలకు అస్సలు పొంతన లేదనిపిస్తుంది. అసలు విషయం అది కాదు… గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ ని జాగ్రత్తగా గమనిస్తే, ఇది రివేంజ్ బ్యాక్  డ్రాప్ లో తెరకెక్కుతున్న డ్రామా అనిపిస్తుంది.

ఇప్పటి వరకు నాని ఈ జోనర్ లో నటించలేదు. ఒకే లక్ష్యంతో ఉన్న ఐదుగురికి లీడర్ గా నటిస్తున్నాడు. మొదట్లో ఈ సినిమా గురించి తెలిసినప్పుడు ఫన్ జోనర్ అని వినిపించినా, దర్శకుడు విక్రమ్ కుమార్ నానిని ఎక్స్ పెక్ట్ చేయని ఆంగిల్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడు.

రీసెంట్ గా రిలీజైన పోస్టర్ లో మోస్ట్ ఎట్రాక్టివ్ నాని లుక్స్ అయితే, ఆ తరవాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఎలిమెంట్ ‘రివెంజర్స్ అసెంబుల్’ అనే ట్యాగ్ లైన్.. చూడాలి.. ఈ గ్యాంగ్ లీడర్ ఈ సినిమాలో ఏం చేయబోతున్నాడో..