నాని ఈ ఏడాది కూడా నంబర్ తప్పడు

Saturday,May 18,2019 - 11:03 by Z_CLU

రీసెంట్ గా ‘జెర్సీ’ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘గ్యాంగ్ లీడర్’ సెట్స్ పై ఉన్నాడు. ఇప్పటికే అనౌన్స్ చేసినట్టు ఆగష్టు 30 కి ఈ సినిమా రిలీజ్ కూడా అయిపోతుంది. ఇక తన 25 వ సినిమా ఇప్పటికే ఇంద్రగంటి చేతిలో పెట్టేశాడు. ఈ లెక్కన చూస్తే ఈ ఏడాది కూడా అస్సలు లెక్క తప్పేలా లేదు… మినిమం 3 సినిమాల ఫార్మాట్ ని అస్సలు వదిలి పెట్టట్లేదు న్యాచురల్ స్టార్.

2015 నుండి గమనిస్తే ప్రతి ఏడాది వరసగా 3 సినిమాలు ఖచ్చితంగా చేస్తున్నాడు నాని. ‘జెండాపై కపిరాజు’ సినిమాతో ఇయర్ ని బిగిన్ చేస్తే అదే ఏడాది ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో క్లోజ్ చేశాడు.

2016 లో కూడా అంతే… క్రిష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మెన్, మజ్ను… 3 సినిమాలు చేశాడు. ఈ లెక్కన ఆవరేజ్ గా ఓ సినిమాకి 4 నెలల కన్నా ఎక్కువగా స్పెండ్ చేయకూడదని రూల్ పెట్టేసుకున్నట్టున్నాడు. అందుకే 2017 లో కూడా నేను లోకల్, నిన్నుకోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకున్నాడు.

2018 లో హీరోగా జస్ట్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాల్లోనే కనిపించినా ఇదే ఏడాది ‘అ!’ సినిమాని నిర్మించి అల్టిమేట్ గా తన ఖాతాలో నంబర్ తగ్గకుండా చూసుకున్నాడు. ఈ ఏడాది కూడా 3 సినిమాలు పక్కాగా లైనప్ చేసుకున్నాడు నాని.