అప్పుడు నాగార్జున ఇప్పుడు వెంకటేష్

Wednesday,April 17,2019 - 10:03 by Z_CLU

నాగార్జున తో దేవదాస్ చేసేశాడు. ఇక ఇమ్మీడియట్ గా చేయాల్సిన మల్టీస్టారర్   వెంకటేష్ తోనే. ఇంకా ఖచ్చితంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ గురించి ఎక్కడా న్యూస్ లేదు కానీ, నానికి వెంకీ పై ఉన్న అభిమానం గమనిస్తే, డెఫ్ఫినెట్ గా వెంకీ తో కూడా సినిమా చేసేస్తాడనే అనిపిస్తుంది.

నాగ్ తో ‘దేవదాస్’ విషయంలో కూడా అంతే. అసలా సినిమాకి డైరెక్టర్ కూడా ఫిక్స్ కాకముందే స్టోరీలైన్ చెప్పి,  నాగార్జున ను కన్విన్స్ చేసుకున్నాడు నాని. నాగార్జున నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి అటాచ్ అయ్యాడు. ఆ తర్వాతే నాగ్ సజెషన్స్ ప్రకారం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. నాని ఈ సినిమాలో నాగార్జున కాంబినేషన్ లో ఎంతగా ఎంజాయ్ చేస్తూ పని చేశాడో, ప్రతి ఫ్రేమ్ లో ఎలివేట్ అవుతుంది.

సాధారణంగా ఫేవరేట్ స్టార్స్ ని చూస్తూ ఇన్స్ పైర్ అయ్యి, ఆ స్థాయి స్టార్స్ అవ్వాలని కోరుకోవడం వేరు. ఓ రేంజ్ స్టార్ అయ్యాక కూడా తన ఫేవరేట్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆరాటపడటం వేరు. నాని ఖచ్చితంగా రెండో రకమే. అందుకే నాని అంటే ఇండస్ట్రీలో ఇష్టపడని స్టార్ ఉండరు.

అటు వెంకీ కూడా కథలో దమ్ముండాలి కానీ, ఎనీ టైమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఈ విషయం నానికి కూడా బాగా తెలుసు కాబట్టి, ఈ న్యాచురల్ స్టార్ ఇప్పటికే ఓ మంచి కథకోసం ట్రయల్స్ స్టార్ట్ చేసే ఉంటాడు అనే టాక్ ఒకటి నడుస్తుంది. అదే గనక జరిగితే జస్ట్ నాని డ్రీమ్ అచీవ్ అయినట్టే అవ్వదు… ఆడియెన్స్ కి కూడా మంచి ట్రీట్ లాంటి సినిమా చూసే అవకాశం దొరుకుతుంది.