వెంకీ మామ ఫస్ట్ వీక్ కలెక్షన్

Friday,December 20,2019 - 05:15 by Z_CLU

రియల్ లైఫ్ మామాఅల్లుడు వెంకటేశ్-నాగచైతన్య కలిసి నటించిన వెంకీమామ సినిమా సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. రిలీజైన ఈ 7 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అయితే బ్రేక్-ఈవెన్ మాత్రం అవ్వలేదు.

ట్రేడ్ ప్రకారం, ఈ సినిమా ఇప్పటివరకు 80శాతం రికవర్ అయినట్టు తెలుస్తోంది. సో.. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి వెంకీమామ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఓవర్సీస్ కలెక్షన్ల ట్రాకింగ్ ను ఆపేయడంతో.. వరల్డ్ వైడ్ ఎగ్జాక్ట్ ఫిగర్ పై డౌట్స్ ఉన్నాయి.

డొమస్టిక్ గా మాత్రం వెంకీమామకు ఈ వారం రోజుల్లో 23 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఓవర్సీస్ వసూళ్లు కూడా కలుపుకుంటే ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ్టి నుంచి వెంకీమామకు పోటీ తప్పదు. ఎందుకంటే సాయితేజ్ నటించిన ప్రతి రోజూ పండగే, బాలయ్య చేసిన రూలర్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.

ఏపీ, నైజాం 7 రోజుల షేర్
నైజాం – రూ. 9.91 కోట్లు
సీడెడ్ – రూ. 3.79 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.27 కోట్లు
ఈస్ట్ – రూ. 1.85 కోట్లు
వెస్ట్ – రూ. 1.15 కోట్లు
గుంటూరు – రూ. 1.85 కోట్లు
నెల్లూరు – రూ. 0.82 కోట్లు
కృష్ణా – రూ. 1.38 కోట్లు