SSMB మహేష్ బర్త్ డే స్పెషల్
Tuesday,August 09,2022 - 01:08 by Z_CLU
ZEE Cinemalu : Mahesh Babu’s Birthday Special
మహేష్….. ‘అష్టా చమ్మా’ లో స్వాతి చెప్పినట్టు ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. అందుకే మహేష్ బాబు పేరు వినగానే ఫ్యాన్స్ ఫేస్ లో ఆటోమేటిక్ గా ఓ మెరుపు వస్తుంది. ఒకసారి మహేష్ కెరీర్ మీద లుక్ వేస్తే … తండ్రి తో బాల నటుడిగా పలు సినిమాల్లో నటించి ‘రాజకుమారుడు’ తో హీరోగా మారి ప్రేక్షకులకు మరింత చేరువైయ్యాడు మహేష్. అక్కడి నుండి హిట్లు , బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ కొడుతూ హీరోగా దూసుకెళ్తున్నాడు.
‘మురారి’ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరై వారి ఇంట్లో కుర్రాడిలా మారిపోయిన మహేష్ ని ఘట్టమనేని ఫ్యాన్స్ కి అలాగే మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసి సూపర్ స్టార్ ని చేసిన సినిమా ‘ఒక్కడు’. ఆ సినిమాతో మహేష్ కమర్షియల్ గా తన సత్తా ఏంటో చాటి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాడు. మహేష్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇది. అక్కడి నుండి ప్రిన్స్ యాక్షన్ సినిమాలతో చెలరేగిపోయాడు. పండుగాడు అంటూ రెచ్చి పోయి ‘పోకిరి’తో రికార్డులు తిరగరాసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసి సూపర్ స్టార్డం అందుకున్నాడు. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నీ ఊచ కొత్త కోసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు సూపర్ స్టార్.
ఇక మహేష్ కథల ఎంపిక గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు మహేష్ హీరోగా ఎవరూ చేయలేని ఎన్నో ప్రయోగాలు చేశాడు. ‘యువరాజు’,’నిజం’,’అర్జున్’ , ‘టక్కరి దొంగ’,’నాని’,’బ్రహ్మోత్సవం’ ఈ సినిమాలతో ప్రయోగం చేసి నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగాడు. ‘అతడు’ సినిమాతో ఓవర్ సీస్ లో మార్కెట్ క్రియేట్ చేసుకొని అక్కడ వరుసగా తన సినిమాలతో మిలియన్లు కొల్లగొడుతూ డిస్ట్రిబ్యూటర్స్ తో సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్తున్నాడు.
సినిమాలు చేయడంతో పాటు ఫ్యామిలీ కి మహేష్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే. షూటింగ్ గ్యాప్ లో రిలీజ్ తర్వాత పక్కా ఫ్యామిలీ మెన్ గా మారిపోయి ట్రిప్స్ వేస్తుంటాడు సూపర్ స్టార్. ఇక సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోగా మారి ఎందఱో చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీ లు చేయిస్తూ వారి గుండెల్లో శ్రీమంతుడు గా ముద్ర వేసుకున్నాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఒక సినిమా ఆ తర్వాత రాజమౌళి తో భారీ సినిమా చేయబోతున్న మహేష్ ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులకు మరింత వినోదం అందించి బిగ్గెస్ట్ హిట్స్ అందుకోవాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ‘జీ సినిమాలు’.

- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics