Mahesh Babu జిమ్ లో సూపర్ స్టార్ .. ఫోటో వైరల్

Thursday,November 10,2022 - 01:33 by Z_CLU

Mahesh Babu workout in Gym pic goes viral

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన హెల్త్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ముఖ్యంగా జిమ్ లో ఎక్కువ వర్కౌట్ చేస్తూ కనిపిస్తుంటాడు. తను డైరెక్ట్ గా పోస్ట్ చేయకపోయినా నమ్రత ఎప్పటికప్పుడు మహేష్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంటుంది. తాజాగా నమ్రత షేర్ చేసిన మహేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫోటోలో మహేష్ ఒక చేత్తో డంబుల్ పట్టుకొని మరో చేత్తో డిప్స్ కొడుతూ కోచ్ ముందు వర్కౌట్ చేస్తూ కనిపించాడు.

షూటింగ్ గ్యాప్ లో జిమ్ లో (Mahesh Exercise) ఎక్కువ సేపు గడుపుతుంటాడు మహేష్. అలాగే స్విమ్మింగ్ కి కూడా ఎక్కువ టైం కేటాయిస్తాడు. తాజాగా మహేష్ జిమ్ లో వర్కౌట్  ఫోటో ను నమ్రత షేర్ చేయడమే ఆలస్యం ఫ్యాన్స్ పోస్టులు పెట్టుకుంటూ మహేష్ అందుకే ఇంత హెల్తీగా ఉంటూ గ్లామర్ గా కనిపిస్తుంటాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమాకు (#SSMB28) సంబంధించి మొదటి షెడ్యుల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యుల్ మొదలు కానుంది. ఈ గ్యాప్ లో తన బాడీ ని మరింత షేప్ లోకి తీసుకొచ్చే పనిలో పడ్డాడు సూపర్ స్టార్.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics