జీ సినిమాలు ( 21st డిసెంబర్ )

Friday,December 20,2019 - 10:02 by Z_CLU

పేపర్ బాయ్

నటీనటులు : సంతోష్ శోభన్, రియా సోమన్

ఇతర నటీనటులు : తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్

డైరెక్టర్ : V. జయశంకర్

ప్రొడ్యూసర్ సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ

రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018

పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

కొంచెం ఇష్టం కొంచెం కష్టం

నటీనటులు : సిద్ధార్థ, తమన్నా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, నాజర్, వేణు మాధవ్, సుధ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ శంకర్–ఎహసాన్–లాయ్

డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్ధసాని

ప్రొడ్యూసర్ నల్లమలుపు శ్రీనివాస్

రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2009

పై చదువుల కోసమని సిటీకి వచ్చిన గీత, అక్కడే ఉండే సిద్ధు ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే సిద్ధూ తమ ప్రేమ గురించి గీత ఫాదర్ కి చెప్తాడో, అప్పుడు సిద్ధూ తల్లిదండ్రులు కలిసి ఉండటం లేదు అనే ఒకే కారణంతో, ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తాడు. అసలు సిద్ధూ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఏంటి..? తన ప్రేమను దక్కించుకోవడానికి సిద్ధూ ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

మిస్టర్

నటీనటులు : వరుణ్ తేజ్లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : హేబా పటేల్నిఖితిన్ ధీర్ప్రిన్స్ సీసిల్పృథ్వీ రాజ్హరీష్ ఉత్తమన్రవి ప్రకాష్సత్యం రాజేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జె. మేయర్

 డైరెక్టర్శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : 7నల్లమలుపు బుజ్జిఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017 

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరాచై కి ఏం చెప్పిందిచై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరుచివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

బ్రూస్ లీ

నటీనటులు రామ్ చరణ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు అరుణ్ విజయ్కృతి కర్బందానదియాసంపత్ రాజ్బ్రహ్మానందంఆలీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

==============================================================================

సుప్రీమ్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్రాశిఖన్నా

ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీరాజేంద్ర ప్రసాద్కబెర్ దుహాన్ సింగ్రవి కిషన్సాయి కుమార్మురళీ మోహన్తనికెళ్ళ భరణి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : అనిల్ రావిపూడి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : మే 5, 2016

సాయిధరమ్ తేజ్రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన  సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

=============================================================================

దృష్టి

నటీనటులు : రాహుల్ రవీంద్రన్, పావని గంగిరెడ్డి

ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, సత్య ప్రకాష్, రవి వర్మ, ప్రమోదిని తదితరులు

మ్యూజిక్ కంపోజర్ : నరేష్ కుమారన్

డైరెక్టర్ : రామ్ అబ్బరాజు

ప్రొడ్యూసర్ : మోహన్

హీరో అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల కాలు ఫ్రాక్చర్ అయి ఇంట్లో ఉండిపోతాడు. బేసిగ్గా ఫోటో గ్రాఫర్ అవ్వడంతో,బోర్ కొట్టినప్పుడల్లా తన కెమెరాతో అవతల పక్కన ఉన్న ఆపార్ట్ మెంట్ లో జనాల్ని గమనిస్తూ ఉంటాడు. ఒక్కోసారి తన దృష్టికి ఓ యంగ్ ప్రేమ జంట కనిపిస్తారు. మరోసారి పిల్లలు విదేశాల్లో ఉండిపోయి ఇక్కడ ఒంటరితనం అనుభవిస్తున్న వృద్ధులు కనిపిస్తారు. ఇక ఇదే వరసలో ఒక మర్డర్ కూడా చూస్తాడు.  కానీ మర్డర్ వలయంలో తనే చుట్టుకుంటాడు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? అసలా మర్డర్ చేసింది ఎవరు…? అనేదే మిగతా కథాంశం.