ట్రైలర్ తో మంచు మనోజ్ రెడీ

Wednesday,August 16,2017 - 04:30 by Z_CLU

‘ఒక్కడు మిగిలాడు’ సినిమాకు సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసిన మంచు మనోజ్ సెప్టెంబర్ 8న ఈ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ తో సినిమా పై అంచనాలు పెంచేసిన మనోజ్ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను ఈ శనివారం 8:45am కు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్..

మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్రతో పాటు స్టూడెంట్ లీడర్ గా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేయబోతున్న ఈ సినిమాకు అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తుండగా శివ నందిగామ మ్యూజిక్ అందిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన ఈ సినిమాకు నేపధ్య సంగీతాన్ని త్వరలో ప్రాగ్ లో రికార్డ్ చేయబోతున్నారు మేకర్స్..