ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ప్రారంభం

Wednesday,August 16,2017 - 03:24 by Z_CLU

చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొణెదల ప్రొడక్షన్స్ కంపెనీ ఆఫీస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని నిరాడంబరంగా నిర్వహించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్, రచయితలు పరుచూరి బ్రదర్స్, అల్లు అరవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సినిమాకు సంబంధించి టైటిల్ లోగో డిజైన్ ను ఈనెల 22న విడుదల చేయబోతున్నారు. ఆ రోజు చిరంజీవి పుట్టినరోజు. కాబట్టి ఆరోజు టైటిల్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. సినిమాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరునే కొనసాగిస్తారా లేక మరో టైటిల్ పెడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించాలని భావిస్తున్నారు. తర్వాత హిందీ, మలయాళంలోకి డబ్ చేస్తారు. సినిమాలో హీరోయిన్లతో పాటు ఇతర టెక్నీషియన్ల వివరాలను 22వ తేదీన ప్రకటించబోతున్నారు.