వినాయకచవితి కి 'జై లవకుశ' నుంచి మరో టీజర్

Wednesday,August 16,2017 - 05:06 by Z_CLU

బాబీ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘జై లవకుశ’ కి సంబంధించి మరో టీజర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే జై క్యారెక్టర్ కి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా లవ కుమార్ క్యారెక్టర్ కి సంబంధించి కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఇప్పుడు ఇదే పాత్రతో టీజర్ రెడీ అయింది. వినాయకచవితికి విడుదలకానుంది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి కుశాల్ ఫస్ట్ లుక్, టీజర్ మాత్రం పెండింగ్ లో ఉంది. అది కూడా ఈ నెలాఖరుకు విడుదల చేయాలని భావిస్తున్నారు.

సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరనస రాశి ఖన్నా, నివేత థామస్  హీరోయిన్స్ గా నటిస్తుండగా నందిత రాజ్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.