నేను ఆరోగ్యంగా ఉన్నాను – రాజశేఖర్

Friday,November 23,2018 - 09:03 by Z_CLU

తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్. గత కొన్ని రోజులుగా రాజశేఖర్ కి ఆక్సిడెంట్ జరిగిందని మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ అసలేం జరిగిందో తన మాటల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే అయినా, అది జస్ట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన చిన్న ప్రమాదమేనని, తనతో పాటు ఈ షెడ్యూల్ లో చాలా మంది ఇన్వాల్వ్ అవ్వడంతో, కనీసం రెస్ట్ కూడా తీసుకోకుండా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నామని క్లియర్ చేశాడు రాజశేఖర్. ఈ షెడ్యూల్ లో రిస్కీ స్టంట్స్ చేశాడు రాజశేఖర్.

ప్రస్తుతం కల్కి నెక్స్ట్ షెడ్యూల్ కోసం కులుమనాలి వెళ్తున్న రాజశేఖర్, తను కంప్లీట్ గా హెల్దీగా ఉన్నాను అని కన్ఫమ్ చేశాడు. దాంతో పాటు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటోస్ గతంలో జరిగిన ఆక్సిడెంట్ కి సంబంధించినవని, రీసెంట్ ఫోటోస్ కాదు అని క్లియర్ చేశాడు రాజశేఖర్.