స్పైడర్ లో రకుల్ ని ఫిక్సవ్వడానికి అదే రీజన్

Wednesday,August 23,2017 - 01:26 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో చాన్స్ దొరకడం అంటే పెద్ద సైజు ప్రమోషన్ దొరికినట్టే. అందుకే చేస్తి నిండా సినిమాలున్నా, సెప్టెంబర్ 23 న రిలీజవుతున్న స్పైడర్ సినిమా విషయంలో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. నిజానికి ఈ సినిమాలో లాస్ట్ మూమెంట్ లో రకుల్ ప్రీత్ సింగ్ కన్ఫం అయింది కానీ, నిజానికి స్పైడర్ టీమ్, రకుల్ కన్నా ముందు, పరిణీతి చోప్రా నే హీరోయిన్ గా ఫిక్సయింది. కానీ లాస్ట్ మూమెంట్ లో డెసిషన్ మార్చుకుంది. దాని వెనక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది.

స్పైడర్ సినిమాని రెండు లాంగ్వేజెస్ లో తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్న సినిమా యూనిట్, పరిణీతి చోప్రాకి రెండు భాషలు కూడా పెద్దగా తెలీకపోవడంతో, ఇబ్బందులు పడే చాన్సెస్ ఉన్నాయనే ఫీలింగ్ తో, అటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్ అయితే బెటర్ అని ఫిక్సయింది స్పైడర్ టీమ్.

ఇకపోతే ఈ నెల 25 నుండి 31 వరకు ఫిక్స్ చేసుకున్న లాస్ట్ షెడ్యూల్ తో ఈ సినిమాకి షూటింగ్ కి కంప్లీట్ గా ప్యాకప్ చెప్పేయనుంది స్పైడర్ టీమ్. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.