మరో రెండు గంటల్లో స్పైడర్ సెన్సార్ రిపోర్ట్

Monday,September 18,2017 - 10:59 by Z_CLU

సెప్టెంబర్ 27 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది మహేష్ బాబు స్పైడర్. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా మరో 2 గంటల్లో సెన్సార్ క్లియరెన్స్ పొందనుంది. A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి అప్పుడే టాలీవుడ్ లో కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది.

హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ అయింది. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ట్రేలర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.