ఎన్టీఆర్ సాంగ్ రీమిక్స్ తో అదరగొడుతున్న బాలయ్య

Wednesday,August 23,2017 - 02:40 by Z_CLU

నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఎవైటింగ్ మూవీగా తెరకెక్కిన ‘పైసా వసూల్’ ప్రస్తుతం రిలీజ్ కి ముందే హల్చల్ చేస్తూ ఫాన్స్ ను విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన స్టంపర్ తో పాటు ట్రైలర్ కూడా సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ సినిమాలో ఇప్పటి వరకూ కనిపించని ఓ కొత్త లుక్, డిఫరెంట్ క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేయబోతున్న బాలయ్య మరో వైపు  తండ్రి ఎన్టీఆర్ ను కూడా గుర్తూ చేస్తూ ఫాన్స్ లో సరి కొత్త జోష్ నింపబోతున్నాడు .

‘పైసా వసూల్’ కోసం ఎన్టీఆర్ నటించిన ‘జీవిత చక్రం’ సినిమాలోని ‘ కంటి చూపు చెబుతోంది… కొంటె నవ్వు చెబుతుందీ ఓ పిల్లా’ అనే పాటను రీమిక్స్ చేసిన బాలయ్య ఈ పాటలో ఎన్టీఆర్ గెటప్ లోనే అప్పటి కాస్టూమ్స్ తోనే కనిపిస్తూ ఎన్టీఆర్ స్టెప్స్ తో ఫాన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ పాట ప్రోమోలో ఎన్టీఆర్ స్టెప్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఎన్టీఆర్ ను గుర్తు చేస్తున్నాడు బాలయ్య…. బాలయ్య తో పాటు హీరోయిన్ కూడా అలనాటి హీరోయిన్ గెటప్ లోనే కనిపిస్తూ ఈ పాట లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇంతకు ముందు ‘మనం’ సినిమా కోసం ‘డోంట్ కేర్’ అంటూ సాగే ఏఎన్ఆర్ అలనాటి పాటను రీమిక్స్ చేసి ఎంటర్ టైన్ చేసిన అనుప్ మరో సారి ఈ రీమేక్ పాటతో ఆకట్టుకున్నాడు. పోర్చుగల్ లో ఈ పాటను చిత్రీకరించారు యూనిట్. మరి ఎన్టీఆర్ ను గుర్తూ చేస్తూ బాలయ్య వేసిన ఈ డాన్సులకు థియేటర్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో..చూడాలి..