సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్న స్పైడర్

Friday,September 29,2017 - 12:01 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ మానియా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సెప్టెంబర్ 27 న రిలీజైన స్పైడర్ ఎక్స్ పెక్టేషన్స్ కి మించి ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది. పాజిటివ్ రివ్యూస్ తో పాటు, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న స్పైడర్ 3 వ రోజు కూడా అంతే స్ట్రాంగ్ గా ప్రదర్శించబడుతుంది.

 

A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మొదటి రోజే 51 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాలోని మోస్ట్ ఎట్రాక్టివ్ ఎలిమెంట్స్ గా నిలిచిన యాక్షన్ ఎపిసోడ్స్, ఓవర్సీస్ లోను అంతే క్రేజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాని N.V. ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించారు.