3 పాటలు మినహా ‘జై లవకుశ’ పూర్తి

Wednesday,August 23,2017 - 12:32 by Z_CLU

ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ జై లవకుశ శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ పూణె షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. మేకర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం3 పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. మరోవైపు  ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ డబ్బింగ్ కూడా ప్రారంభించాడు.

ఇప్పటికే జై టీజర్ తో హంగామా చేసిన మేకర్స్ వినాయక చవితి కానుకగా లవకుమార్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. రేపు (ఆగస్ట్ 24) సాయంత్రం సరిగ్గా 5గంటల 40 నిమిషాలకు లవకుమార్ టీజర్ విడుదల అవుతుంది. ఆ తర్వాత వారం గ్యాప్ లో కుశ ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారు.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమాలో యంగ్ టైగర్ సరసన రాశిఖన్నానివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందితరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.