మహేష్ బాబును పొగిడిన రకుల్ ప్రీత్ సింగ్

Tuesday,September 19,2017 - 10:03 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇంత ప్రెస్టీజియస్ వెంచర్ లో హీరోయిన్ గా చాన్స్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ, స్పైడర్ తన కరియర్ లోనే చాలా గొప్ప సినిమా అని చెప్పుకుంది.

రీసెంట్ గా జరిగిన స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన రకుల్, తన కరియర్ బిగినింగ్ నుండే AR మురుగదాస్ డైరెక్షన్ లో నటించాలనే కోరిక స్పైడర్ సినిమాతో నెరవేరింది చెప్పుకుంది. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, ‘ఇంత గొప్ప స్టార్ అయి ఉండి కూడా అందరితో చాలా జోవియల్ గా ఉండటం నిజంగా చాలా గ్రేట్’ అని చెప్తూనే, మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్’ అని పొగిడేసింది.

ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్న రకుల్ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమాని N.V. ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించారు.