మహర్షి గుమ్మడికాయ కొట్టేశాడు

Thursday,April 18,2019 - 04:30 by Z_CLU

దాదాపు ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి సినిమా ఎట్టకేలకు పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ ఇవాళ్టితో పూర్తయింది. ఈ విషయాన్ని యూనిట్ స్వయంగా ప్రకటించింది.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిన్నపాటి పార్టీ చేసుకుంది మహర్షి యూనిట్. మహేష్ కూతురు సితారతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీకి హీరోహీరోయిన్లు, కీలకమైన యూనిట్ సభ్యులతో పాటు మహేష్ భార్య నమ్రత కూడా హాజరైంది.

తనకు మహర్షి సినిమా అవకాశం ఇచ్చిన మహేష్ కు నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. మహర్షి అనుభవం తనకు జీవితాంతం గుర్తుండి పోతుందని చెప్పాడు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమాకు సంబంధించి 3 రోజులుగా సాంగ్ షూట్ చేశారు. ఆ పాటతో సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయింది

మే 9న మహర్షి సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటికే 2 పాటలు రిలీజయ్యాయి. పీవీపీ, దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. అల్లరినరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.