షూటింగ్ అప్ డేట్స్

Wednesday,January 30,2019 - 01:48 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న కొన్ని సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం…


సైరా

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ సమీపంలో జరుగుతుంది. ప్రత్యేకంగా వేసిన జాతర సెట్ లో చిరు, తమన్నా లపై ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు యూనిట్. మరో రెండు రోజులపాటు ఈ సాంగ్ షూట్ జరగనుంది. ఓ రెండు మూడు రోజుల బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫిబ్రవరి 4 నుండి షూట్ కంటిన్యూ చేయనున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మహర్షి

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ మూవీ పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. ఈ షెడ్యూల్ లో మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసిన యూనిట్ ఓ వారం గ్యాప్ తీసుకొని, వచ్చే నెల నుంచి మరో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుంది. మహేష్-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరినరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మూవీలో మహేష్ 3 గెటప్స్ లో కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. వీటిలో కాలేజ్ స్టూడెంట్, బిజినెస్ మేన్ గెటప్స్ తో ఇప్పటికే లుక్స్ విడుదల చేశారు. మూడో గెటప్ పై ప్రస్తుతం సస్పెన్స్ నడుస్తోంది. మహర్షి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 26న ఈ సినిమాను థియేటర్లలోకి రానుంది.


డియర్ కామ్రేడ్

విజయ్ దేవేరకొండ , రష్మిక జంటగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ ఇటివలే కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. భరత్ కమ్మ డైరెక్షన లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 5 నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో రష్మిక పై కొన్ని క్రికెట్ కి సంబందించిన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ ఫిబ్రవరి నెలాఖరు వరకూ జరగనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ -బిగ్ బెన్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్ట్ ఇన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాథ్ -రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ ప్రస్తుతం ఓల్డ్ సిటీలో జరుగుతోంది. రామ్ తో పాటు కొందరు ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో హీరోయిన్ నిధి అగర్వాల్ షూట్ లో పాల్గొననుంది. లాంగ్ బ్రేక్ తీసుకోకుండా టోటల్ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. పూరి టూరింగ్ టాకీస్ – పూరి కనెక్ట్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ , చార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.


దొరసాని

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ – రాజశేఖర్ కూతురు జంటగా నటిస్తున్న సినిమా ‘దొరసాని’. ఇటివలే వరంగల్ షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సిద్దిపేట్ లో మరో పదిరోజుల పాటు షూట్ జరుపుకోనుంది. సురేష్ బాబు , మధురా శ్రీధర్ ,యష్ రంగినేని కంబైన్ గా నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది.

కార్తికేయ సినిమా 

ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఒంగోలు లో జరుగుతోంది. జ్ఞాపికా ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ఒంగోల్ షెడ్యూల్ ఫినిష్ చేసుకోనుంది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కార్తికేయ సరసన అనఘ హీరోయిన్ గా నటిస్తోంది.