వాళ్ళే సినిమాకు హీరోలు - లారెన్స్

Thursday,April 18,2019 - 05:12 by Z_CLU

లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంచన 3’ తెలుగు, తమిళ భాషల్లో రేపే భారీగా విడుదలవుతుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కాంచన సిరీస్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న లారెన్స్ ఈ సినిమా కూడా అదే రేంజ్ హిట్ సాదిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లేటెస్ట్ గా కాంచన 3 గురించి కొన్ని విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు లారెన్స్.

రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో నాతో పాటు నటించిన వేదిక ‘ముని’లో కూడా నటించింది. నాకు లక్కీ హీరోయిన్‌. నటనలో చాలా ఇంప్రూవ్‌ అయ్యింది. నిక్కీ తంబోలి కి ఇది తొలి సినిమా. కామెడి సన్నివేశాల్లో బాగా నటించింది. ఈ సినిమాలో శ్రీమాన్‌, కోవైసరళ, దేవదర్శిని లేకుండా ఉండుంటే ఏదో ఒకటి మిస్‌ అయిన ఫీలింగ్‌ ఉండుండేది. ఈ సినిమాలో వాళ్లే హీరోలు. వాళ్ల కామెడీ మళ్ళీ మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌. ఆయనకు ఈ సినిమా మంచి పేరు, డబ్బులు తెచ్చిపెట్టాలని ఆ రాఘవేంద్ర స్వామిని కోరుకుంటున్నాను.” అన్నారు