షూటింగ్ అప్ డేట్స్

Tuesday,February 12,2019 - 04:58 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న కొన్ని సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం…

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. కోకాపేట్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిరు , తమన్నా లపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు యూనిట్. ఏప్రిల్ వరకూ టోటల్ షూట్ ని ఫినిష్ చేసే పనిలో నిమగ్నమయ్యారు మేకర్స్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.

ఇటివలే పొల్లాచ్చి షెడ్యుల్ ఫినిష్ చేసుకున్న మహేష్  ‘మహర్షి’ షూటింగ్ ప్రస్తుతం ఆర్.ఎఫ్.సి లో జరుగుతోంది. సినిమాలో వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను తీస్తున్నాడు వంశీ పైడిపల్లి. మరో రెండు రోజుల పాటు అక్కడే షూట్ చేసి చిన్న బ్రేక్ తీసుకోకున్నారు యూనిట్. ఇప్పటికే 90 శాతం షూట్ కంప్లీట్ అయినట్లు సమాచారం. అశ్వనిదత్ , దిల్ రాజు , పి.వి,పి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25 థియేటర్స్ లోకి రానుంది.

పూరి జగన్నాథ్ -రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ఫ్యాక్టరి లో జరుగుతుంది. ఇప్పటికే ఓల్డ్ సిటీ లో కొన్ని సీన్స్ షూట్ చేసిన యూనిట్ ప్రెజెంట్ ఓ యాక్షన్ పార్ట్ షూట్ చేసే పనిలో ఉన్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్ , నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ చార్మీ నిర్మిస్తున్నారు.

మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో నటిస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం మున్నార్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ కి సంబంధించి చైల్డ్ ఎపిసోడ్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

సందీప్ కిషన్ హన్సిక హీరో హీరోయిన్లుగా జి.నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తెనాలి రామకృష్ణ BABL’ షూటింగ్ ప్రెజెంట్ కర్నూల్ లో  జరుగుతుంది. ఇటివలే మొదలైన ఈ షెడ్యూల్ ఈ నెల 22 వరకూ జరగనుంది. కర్నూల్  కోర్టులో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. కర్నూల్ నేపథ్యంలో జరిగే కథ కావడంతో టోటల్ షూటింగ్ అక్కడే జరగనుంది.

ఆకాష్ పూరి హీరోగా అనిల్ పాడురి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రొమాంటిక్’ సినిమా ప్రస్తుతం బోయినపల్లిలో షూటింగ్ జరుపుకుంటుంది. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ కథతో పాటు స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్నాడు. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ , ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.