కాంచన-3.. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో అంచనాలు

Thursday,April 18,2019 - 04:04 by Z_CLU

థియేటర్లలో సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమైంది కాంచన-3. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, తన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుందంటున్నాడు లారెన్స్. అంతేకాదు, లారెన్స్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్ మూవీగా నిలవబోతోంది.

ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది కాంచన-3. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 థియేటర్లలో ఈ సినిమా విడుదలకాబోతోంది. ఓవైపు హిందీలో అక్షయ్ కుమార్ తో కాంచన సినిమా రీమేక్ చేయబోతున్నాడు లారెన్స్. మరోవైపు అక్కడ కాంచన-3 డబ్బింగ్ వెర్షన్ బాలీవుడ్ కూడా విడుదలవుతోంది.

తనే నటించి, నిర్మించి, లారెన్స్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను హిందీలో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, తమిళ్ లో సన్ పిక్చర్స్, తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు.

కాంచన-3 కేవలం హారర్ సినిమా కాదంటున్నాడు లారెన్స్. వేదిక, ఒవియా, నిక్కీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పాటలు, కామెడీ సూపర్ గా ఉంటాయంటున్నాడు. ఒక పాట కోసం అచ్చంగా కోటి 30 లక్షల రూపాయలు ఖర్చుచేశామని.. పాటలతో పాటు మంచి కామెడీ, డ్రామా కూడా ఉంటుందంటున్నాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది కాంచన-3.