మహర్షి కోసం మహేష్ పర్యటనలు

Thursday,March 21,2019 - 07:26 by Z_CLU

మహర్షి రిలీజ్ డేట్ వచ్చేసింది. షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ అయిపోయింది. మరి ప్రచారం సంగతేంటి? ఇక్కడే కొత్తగా ఆలోచించింది యూనిట్. మహేష్ కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 25వ సినిమా కావడంతో.. ప్రమోషన్ ను కూడా అంతే కొత్తగా ప్లాన్ చేశారు.

అవును.. ఈ సినిమా కోసం సరికొత్తగా ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో పర్యటిస్తాడు. సినిమాకు ఎక్స్ క్లూజివ్ గా ప్రచారం చేస్తాడు. నిజానికి ఇది కొత్త తరహా ప్రచారమేం కాదు, కాకపోతే మహేష్ కు పూర్తిగా కొత్త.

వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రచారాన్ని అఫీషియల్ గా ప్రారంభించబోతున్నారు. రెగ్యులర్ గా ఉండే ఆడియో రిలీజ్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్, టీజర్ రిలీజ్ లాంటి కార్యక్రమాలకు అదనంగా, ఇలా మహేష్ తో టూర్స్ ప్లాన్ చేశారున్నమాట.