ఉగాది కానుకగా మహర్షి టీజర్

Thursday,April 04,2019 - 05:04 by Z_CLU

మహర్షి ప్రమోషన్ ఊపందుకుంటోంది. ఇప్పటికే సింగిల్స్ రిలీజ్ చేసే కార్యక్రమాన్ని షురూ చేసిన మహేష్.. ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. ఉగాది కానుకగా 6వ తేదీన ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మహర్షి టీజర్ విడుదల కాబోతోంది.

మహేష్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అదెప్పుడూ హాట్ టాపిక్కే. కానీ మహర్షి సినిమా అంతకుమించి. ఎందుకంటే ఇది మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం. మహేష్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న సినిమా. పైగా మహేష్ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా. అందుకే ఈ సినిమాపై అందరి ఫోకస్ పెరిగింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన ఫస్ట్ టైం పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు, హీరో అల్లరినరేష్ తొలిసారిగా హీరో క్యారెక్టర్స్ నుంచి పక్కకొచ్చి మహేష్ బెస్ట్ ఫ్రెండ్ గా నటించాడు ఇందులో. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే మహర్షి సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.