కీలకమైన విషయాలపై క్లారిటీ ఇచ్చిన మహేష్

Thursday,December 07,2017 - 02:15 by Z_CLU

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమాపై మొన్నటివరకు చాలా పుకార్లు వచ్చాయి. ఎట్టకేలకు ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ తో బులెటిన్ రిలీజ్ చేశారు మేకర్స్. భరత్ అనే నేను సినిమాకు సంబంధించి నెక్ట్స్ షెడ్యూల్ ఈనెల 13 నుంచి ప్రారంభం అవుతుంది. 26వ తేదీవరకు ఇది కొనసాగుతుంది.

ఇక కీలకమైన ఫస్ట్ లుక్ పై కూడా క్లారిటీ ఇచ్చింది యూనిట్. ఫస్ట్ లుక్ విడుదల తేదీని ఇంకా లాక్ చేయలేదని ప్రకటించారు. మరోవైపు విడుదల తేదీపై కూడా స్పష్టత ఇచ్చింది. ఇంతకుముందే ప్రకటించినట్టు ఏప్రిల్ 27కే కట్టుబడి ఉన్నామని క్లారిటీ ఇచ్చింది.

2.0 రిలీజ్ తో భరత్ అనే నేను సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. తాజా ప్రకటనతో వాటిలో నిజం లేదని తేలిపోయింది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.