సీఎం ఛాంబర్ లో పని పూర్తిచేసిన మహేష్

Monday,November 06,2017 - 03:24 by Z_CLU

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా భరత్ అనే నేను. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటివరకు అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన “సీఎం ఛాంబర్” సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇవాళ్టితో ఈ షెడ్యూల్ ముగిసింది.

ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు మహేష్. ఇతడి సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకిదే తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్ ను త్వరలోనే వెల్లడిస్తారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 27న భరత్ అనే నేను సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.