ఆడియో రిలీజ్ తో పాటు ప్రీ-రిలీజ్ కూడా

Thursday,December 07,2017 - 01:03 by Z_CLU

ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు కలిసిపోయిన రోజులివి. వీటిలో ఏదో ఒకటి మాత్రమే సెలబ్రేట్ చేస్తారు. మ్యాగ్జిమమ్ ఆడియో ఫంక్షన్లు పోయి వాటి స్థానాన్ని ప్రీ-రిలీజ్ లు ఆక్రమించేశాయి. కానీ హలో సినిమాకు సంబంధించి మాత్రం ఈ రెండూ ఉంటాయంటున్నాడు నాగ్.

“డిసెంబర్ 10న విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్స్ లో హలో ఆడియో ఉంటుంది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా ప్లాన్ చేశాం. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తప్పకుండా చేస్తాం. అది హైదరాబాద్ లో ఉంటుంది. ఇంకా తేదీ ఫిక్స్ చేయలేదు. అఖిల్ ప్రమోషన్ కోసం అమెరికా వెళ్తున్నాడు. 18 లేదా 19న అఖిల్ హైదరాబాద్ వచ్చిన వెంటనే తేదీపై ఓ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం.” ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పై నాగ్ ఎనౌన్స్ మెంట్ ఇది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమాతో లిజి కూతురు కల్యాణి హీరోయిన్ గా పరిచయమౌతోంది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది హలో.