పాతికేళ్ల జర్నీని గుర్తుచేసుకున్న మహేష్

Thursday,May 02,2019 - 01:10 by Z_CLU

తన కెరీర్ లో 25వ సినిమా చేశాడు మహేష్. ఈ సందర్భంగా తన కెరీర్ జర్నీని గుర్తుచేసుకున్నాడు. తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులకు థ్యాంక్స్ చెప్పాడు.

ఈ పాతిక సినిమాల జర్నీలో నేను థాంక్స్‌ చెప్పుకోవాల్సిన డైరెక్టర్స్‌ చాలా మందే ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావుగారికి థాంక్స్‌. ఎందుకంటే ఆయన నన్ను ఇంట్రడ్యూస్‌ చేశారు. ఆయనకు ఎప్పడూ రుణపడి ఉంటాను. అలాగే ‘మురారి’ సినిమా చేసిన క ష్ణవంశీగారికి థాంక్స్‌. నన్ను స్టార్‌ను చేసిన సినిమా ‘ఒక్కడు’ చేసిన గుణశేఖర్‌కి థాంక్స్‌. అలాగే నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్‌, యు.ఎస్‌. ఆడియెన్స్‌కు దగ్గర చేసిన సినిమా ‘అతడు’. ఆ సినిమా చేసిన త్రివిక్రమ్‌గారికి థాంక్స్‌. నా లైఫ్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పుకోవాలంటే ‘దూకుడు’ సినిమాయే. ఆ సినిమా చేసిన శ్రీనువైట్లగారికి థాంక్స్‌. ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ సినిమాలతో రెండు సార్లు లైఫ్‌ ఇచ్చిన కొరటాల గారిక థాంక్స్‌. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

అయితే తన ప్రసంగంలో పొరపాటున పూరి జగన్నాధ్ పేరును ప్రస్తావించడం మరిచిపోయాడు మహేష్. అందుకే వెంటనే ట్విట్టర్ లో స్పందించాడు. తనకు పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి జగన్నాధ్ కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాడు.