విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య
Thursday,December 07,2017 - 03:27 by Z_CLU
అఖిల్ హీరోగా హలో సినిమా చేసిన విక్రమ్.. త్వరలోనే నాగచైతన్యను కూడా డైరక్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రకటించాడు. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుంది.
“నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్ సెట్ చేశాను. కానీ హలో తర్వాత విక్రమ్ మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ మూవీ అయిన తర్వాత నాగచైతన్యతో సినిమా చేస్తానని చెప్పాడు. తప్పకుండా చేస్తానని మాటిచ్చాడు. నేను కూడా ఆ సినిమా తర్వాత కొన్నాళ్లు ప్రొడక్షన్ ఆపేసి, బయట సినిమాలు చేద్దామనుకుంటున్నాను. ప్రొడక్షన్ భారం తగ్గితే కాస్త హాయిగా ఉంటుంది నాక్కూడా.” నాగచైతన్య, విక్రమ్ కుమార్ సినిమాపై నాగ్ రియాక్షన్ ఇది
ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు అనే సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మూవీ ఉంటుంది. ఇంతకుముందు విక్రమ్ కుమార్, నాగచైతన్య కాంబినేషన్ లో మనం సినిమా వచ్చింది.