మహేష్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్

Saturday,November 11,2017 - 04:30 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ షూటింగ్ మొన్నటివరకు హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో జరిగింది. అక్కడ సీఎం ఛాంబర్ సెట్ వేసి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. హైదరాబాద్ లోనే మరో లొకేషన్ లో మహేష్ పై హోలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్ కూడా తీశారు. తాజాగా ఈ షెడ్యూల్స్ అన్నీ పూర్తయ్యాయి.

మహేష్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ పొలాచ్చిలో ఈనెల 26 నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ కూడా మహేష్ పై ఓ భారీ ఫైట్ తో పాటు కొన్ని సాంగ్ బిట్స్ పిక్చరైజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ అమెరికాలో ఉన్నాడు. ఓ యాడ్ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లాడు మహేష్. భరత్ అనే నేను సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాన నిర్మిస్తున్నాడు.