హ్యాపీ బర్త్ డే కొరటాల

Friday,June 15,2018 - 11:07 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరక్టర్ కొరటాల శివ ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు కొరటాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. కెరీర్ స్టార్ట్ చేసినప్పట్నుంచి ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది లేకుండా దూసుకుపోతున్నాడు కొరటాల శివ

మిర్చితో దర్శకుడిగా మారిన ఈ డైలాగ్ రైటర్.. ఆ సినిమా సక్సెస్ తో ఇక వెనక్కితిరిగి చూడలేదు. మిర్చి తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా చేశాడు. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన జనతా గ్యారేజ్ సినిమా కూడా బ్లాక్ బస్టరే. రీసెంట్ గా మహేష్ తో మరోసారి చేసిన భరత్ అనే నేను సినిమా కూడా బ్లాక్ బస్టరే. ఇలా కొరటాల చేసిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్.

తన సినిమాల్లో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా.. మెసేజ్ కూడా అందించడం కొరటాల స్టయిల్. సందేశాత్మక చిత్రాలు తీస్తే సరిగ్గా ఆడవనే సెంటిమెంట్ ను కొరటాల బ్రేక్ చేశాడు. బ్లాక్ బస్టర్ సినిమాలతో చక్కటి మెసేజ్ కూడా అందించాడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు పారిస్ లో ఉన్నాడు. కొన్ని రోజులు అక్కడ రిలాక్స్ అయిన తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాడు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, చిరంజీవితో కొరటాల సినిమా చేసే ఛాన్స్ ఉంది. బ్లాక్ బస్టర్ డైరక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.