మహేష్ 'స్పైడర్' ఫస్ట్ లుక్ టీజర్

Thursday,June 01,2017 - 10:35 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్  హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్, భారీ బడ్జెట్ మూవీ స్పైడర్ హంగామా షురూ అయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ గ్రాండ్ గా రిలీజైంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయం టీజర్ చూస్తేనే అర్థమౌతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ చివరి వారంలో స్పైడర్ సినిమా థియేటర్లలోకి రానుంది. NVR సినిమాస్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు.