రోజురోజుకు స్ట్రాంగ్ అవుతున్న రారండోయ్

Thursday,June 01,2017 - 10:10 by Z_CLU

నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రోజురోజుకు స్ట్రాంగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో బాహుబలి-2 సినిమా తర్వాత ఈ మూవీనే అత్యధిక వసూళ్లు సాధిస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు 3 కోట్ల రూపాయలు వచ్చాయి.

ఏపీ, తెలంగాణలో రారండోయ్ సినిమా 5 రోజుల వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 4.20 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.84 కోట్లు
సీడెడ్ – 1.78 కోట్లు
ఈస్ట్ – 1.05 కోట్లు
వెస్ట్ – 0.77 కోట్లు
కృష్ణా – 0.99 కోట్లు
నెల్లూరు – 0.38 కోట్లు
గుంటూరు – 1.05 కోట్లు

ఏపీ, తెలంగాణ 5 రోజుల వసూళ్లు – 12.06 కోట్ల షేర్
అమెరికా షేర్ – 3.15 కోట్లు