సూపర్ స్టార్ కి తగ్గ టైటిల్

Friday,May 31,2019 - 12:33 by Z_CLU

మహేష్ బాబు కొత్త సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఈ సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరు..’ అని టైటిల్ ఫిక్సయ్యారు మేకర్స్.

ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నాడు. క్యారెక్టర్ పరంగా సినిమాలో మహేష్ బాబు యాక్షన్ మార్క్ తో పాటు, బిగినింగ్ నుండి చెప్తున్నట్టు అనిల్ రావిపూడి మార్క్ ఫ్రెష్ కామెడీ ఎలిమెంట్స్ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటించనుంది. DSP మ్యూజిక్ కంపోజర్. AK ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ వెంకశ్వర క్రియేషన్స్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. 2020 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమా.