‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఇంటి పేరు మార్చుకుంటాడా...?

Friday,May 31,2019 - 02:02 by Z_CLU

‘బొమ్మరిల్లు’ సక్సెస్ తో ఆ సినిమా టైటిల్ దర్శకుడు భాస్కర్ ఇంటి పేరుగా మారిపోయింది. ఆ సినిమా తరవాత ఇంకా సినిమాలు చేసినా, ఆ పేరుతోనే ఈ దర్శకుడిని గుర్తిస్తున్నారు. ఇప్పుడు అఖిల్ తో సినిమా చేస్తున్నాడు. 1 కాదు 2 కాదు ఏకంగా ఏడేళ్ళ గ్యాప్… ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి అని కసిగా ఉన్న ఈ ఫిలిమ్ మేకర్… ‘బొమ్మరిల్లు’ స్థాయి సక్సెస్ అందుకుంటాడా …? ఇకనుండి ఈ సినిమా టైటిల్ భాస్కర్ ఇంటి పేరుగా మారే స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అందుకుంటుందా..?

సినిమా సెట్స్ పైకి వచ్చాక పెద్దగా టైమ్ తీసుకోడు కానీ, కథ, డైరెక్టర్ ని ఎంచుకునే విషయంలో చాలా సమయం తీసుకుంటాడు అఖిల్. అందుకే అఖిల్ కొత్త సినిమా అనగానే అంచనాలు కూడా ఇమ్మీడియట్ గా సెట్ అయిపోతాయి. అలా మరోసారి ఫోకస్ లోకి వచ్చాడు బొమ్మరిల్లు భాస్కర్.

బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఒక్కసారి చూసినా చాలు కొన్నేళ్ళ వరకు ఆ సినిమా తాలూకు క్యారెక్టర్స్ మైండ్ లో అలా నిలిచిపోతాయి.. కథపై ఎంతగా పని చేస్తాడో, సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ని అంతే ఫోకస్ లో పెడతాడు…

ఆ స్థాయి దర్శకుడికి అఖిల్ లాంటి స్టార్ దొరికాడు కాబట్టి ఈసారి ‘బొమ్మరిల్లు’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా గ్యారంటీ అనే వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఓ బ్లాక్ బస్టర్ టైటిల్ ని ఇంటి పేరుగా మార్చుకున్న భాస్కర్, ఈ సారి అఖిల్ తో మరో బ్లాక్ బస్టర్ సినిమా తీసి, ఈ టైటిల్ ని ఇంటి పేరుగా మార్చుకోవడం గ్యారంటీ అనే సూచనలే కనిపిస్తున్నాయి.