బయోపికే – కానీ ఇది వేరు...

Friday,May 31,2019 - 12:02 by Z_CLU

టాలీవుడ్ బయోపిక్ లిస్టులో మరో బయోపిక్ చేరనుంది. రీసెంట్ గా రిలీజైన ‘మల్లేశం’ మరీ కంప్లీట్ కాన్సంట్రేషన్ ని గ్రాబ్ చేసేసిందని చెప్పలేం కానీ, రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో అంతే న్యాచురల్ గా తెరకెక్కినట్టుందనే జెన్యూన్ ఒపీనియన్ అయితే ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు రిలీజైన బయోపిక్స్ వేరు… ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న ‘మల్లేశం’ వేరు…

‘మహానటి’ నుండి మొదలైతే రీసెంట్ గా రిలీజైన ‘మహా నాయకుడు’ వరకు ఇటు సినిమా బ్యాక్ డ్రాప్ లోనో, లేకపోతే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనో ఆడియెన్స్ లో క్రేజ్ ఉన్న వారి లైఫ్ ఆధారంగా తెరకెక్కినవే. వారి గురించి ఆడియెన్స్ కి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కానీ, వారి రియల్ లైఫ్ లోని కొన్ని అంశాలను ఫ్యాన్స్ కి తెలిసేలా చేశాయి ఈ బయోపిక్స్…

ఇక ‘మల్లేశం’ విషయానికి వస్తే పేరు వినగానే మైండ్ లో మెదిలే మనిషి కథ కాదు.. ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉన్న వ్యక్తి కథ. ఒక సాధారణ నేత కార్మికుడు  చదువుకోకుండానే ఇంజినీర్ అని ఎలా అనిపించుకున్నాడు..? ‘పద్మశ్రీ’ అవార్డు అందుకునే స్థాయికి ఎలా ఎదిగాడు..? తను నమ్ముకున్న వృత్తిలో ఎలాంటి రివొల్యూషన్ తీసుకు వచ్చాడు..? అనేదే ఈ బయోపిక్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్…

టాలీవుడ్ లో ఆల్మోస్ట్ బయోపిక్ సీజన్ ముగిసింది అనే సమయంలో వస్తున్న ‘మల్లేశం’ చుట్టూ క్రియేట్ అవుతున్న వైబ్స్ చూస్తుంటే, ఈ బయోపిక్ తరవాత బాలీవుడ్ తరహాలో డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ లో మరింత మంది గొప్పవాళ్ళ రియల్ స్టోరీస్ స్క్రీన్ పై చూసుకునే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది.