మరింత స్పెషల్ కానున్న ఈ ఏడాది సంక్రాంతి

Monday,October 14,2019 - 02:44 by Z_CLU

ఈ ఏడాది సంక్రాంతి సీజన్ మరింత కలర్ ఫుల్ కానుంది. పండక్కి వరస సినిమాల రిలీజులు కామనే. కానీ ఏడాది మరింత స్పెషల్ కానుంది. కారణం… జనవరి 12… సూపర్ స్టార్.. స్టైలిష్ స్టార్ ల సినిమాలు ఒకే రోజు థియేటర్స్ లోకి రావడమే. సంక్రాంతికి వస్తున్నామని ముందుగానే రివీల్ చేసినా… రీసెంట్ గా అఫీషియల్ గా డేట్స్ కన్ఫమ్ చేశారు మేకర్స్.

అల్లు అర్జున్ ‘అల… వైకుంఠపురములో’ నుండి చిన్న అప్డేట్ బయటికి వచ్చినా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఆ రేంజ్ లో ఈ సినిమా చుట్టూ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన ‘సామజ వరగమనా’ సాంగ్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసింది. దానికి తోడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల క్రేజే కాంబినేషన్.. ఇలా చెపుకుంటూ పోతే ఈ సినిమాని ఫోకస్ లోకి తీసుకువచ్చిన కారణాలు బోలెడు ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ సినిమా కూడా అంతే…

వరస సీరియస్ సినిమాల తరవాత చాలా రోజుల తరవాత కూసంత కామెడీ కంటెంట్ ఉన్న కథతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేస్తున్నాడు మహేష్ బాబు. దానికి తోడు మిలిటరీ బ్యాక్ డ్రాప్. సినిమాలో జస్ట్ కామెడీనే కాదు.. కావాల్సినంత యాక్షన్ కూడా ఉంటుందని, రీసెంట్ గా దసరా పండక్కి రిలీజ్ చేసిన స్టిల్ తో ఎలివేట్ చేశారు మేకర్స్.. దాంతో సోషల్ మీడియాలో మహేష్ మానియా నడుస్తుంది.

సంక్రాంతికి స్టార్ సినిమాలు లైనప్ అవ్వడం ఎక్స్ పెక్టెడే కానీ, ఇలా ఇద్దరూ టాప్ హీరోలు ఒకేరోజు బాక్సాఫీస్ బరిలోకి దిగడం మాత్రం కొంచెం రేర్ గా జరిగేదే. అందుకే ఈ సినిమాల రిలీజ్ అనౌన్స్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.