'అవికా గోర్' ఇంటర్వ్యూ

Monday,October 14,2019 - 03:57 by Z_CLU

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న అవికా గోర్ ఇప్పుడు ‘రాజు గారి గది 3’ తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు అవికా మాటల్లోనే…

 

గ్యాప్ కి రీజన్ అదే

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తర్వాత తెలుగులో కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ క్యారెక్టర్స్ నన్ను ఎగ్జైట్ చేయలేదు. పైగా రెండు టివీషోలు అలాగే ఒక సినిమా చేయడం వల్ల ఇక్కడ ఫోకస్ పెట్టలేకపోయాను.

నలబై నిమిషాల్లో

‘రాజు గారి గది 3’ లో నేను పార్ట్ అవ్వడం, లీడ్ క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ క్యారెక్టర్ ను తమన్నాతో చేయించాలని అనుకున్నామని డేట్స్ కుదర్లేదని ఓంకార్ గారు చెప్పారు. సో నా డేట్స్ ఎవైలబుల్ ఉండటంతో నలబై నిమిషాలు నాకు స్టోరీ నరేట్ చేసారు. సో కథ విన్న వెంటనే ఒకే చెప్పేసాను. క్యారెక్టర్ కి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాను. సినిమాతో పాటు నా క్యారెక్టర్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను.

అలి గారితో నా డ్రీం

అలి గారు నటించిన చాలా డబ్బింగ్ సినిమాలు చూసాను. ఎప్పటికైనా ఆయనతో యాక్ట్ చేయాలని మా అమ్మ అంటుండేది. ఈ సినిమాతో ఆ చాన్స్ వచ్చింది. ఆయనను ఫస్ట్ టైం సెట్స్ లో మీట్ అవ్వగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. అలాంటి సీనియర్ యాక్టర్స్ తో యాక్ట్ చేయడం ఓ కిక్. ఆ కిక్ ను ఈ సినిమాతో పొందాను.

నాకు టీం మేటర్

కథ , క్యారెక్టర్ తో పాటు టీం కూడా నాకు మేటర్. ముందుగా టీంను దృష్టిలో పెట్టుకునే సినిమా ఒకే చేస్తాను. ఈ సినిమాకు వర్క్ చేసిన టీం అందరూ బెస్ట్ వర్క్ ఇచ్చారు. అందుకే సినిమా తొందరగా ఫినిష్ అయింది.

 

హార్రర్ సినిమాలు చూడను

నేను హార్రర్ సినిమాలు చూడను. ఆ జోనర్ కి కాస్త దూరంగానే ఉంటాను. ఓంకార్ గారు స్క్రిప్ట్ నెరేట్ చేసే టప్పుడు కూడా చాలా భయపడ్డాను. కానీ ఈ సినిమాలో హార్రర్ తో పాటు బ్రిలియంట్ కామెడీ ఉంది. ఆ కామెడీ సీన్స్ అందరినీ తప్పకుండా నవ్విస్తాయి.

నాన్న అలా అన్నారు

ఫస్ట్ టైం దెయ్యం మేకప్ లో కనిపించగానే నాన్న ‘ఇదీ నువ్వు’ అంటూ ఆటపట్టించారు. నాన్న చేసిన ఆ కామెంట్ ను కాంప్లిమెంట్ గానే తీసుకున్నాను.

 

పదిహేను రోజుల్లో

తెలుగులో ఇంకో సినిమా సైన్ చేసాను. ఆ సినిమా గురించి చెప్పాలనుంది. కానీ మరో పదిహేను రోజుల్లో అనౌన్స్ ఉంటుందని చెప్పారు. సో అప్పటి వరకూ ఆ సినిమా గురించి ఏం చెప్పలేను.