‘బుట్టబొమ్మ’ కూడా బావుంది...

Tuesday,December 24,2019 - 06:12 by Z_CLU

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో..’ లో నుండి ఇది 4 వ పాట. ఇప్పటికే రిలీజైన 3 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవడంతో న్యాచురల్ గానే ఈ పాటపై కూడా మ్యూజిక్ లవర్స్ లో అంచనాలున్నాయి. వాటిని 100% అందుకున్నాడు తమన్. ‘బుట్టబొమ్మ’ ఊహించినట్టుగానే అందరికీ నచ్చేస్తుంది.

తమన్ ట్యూన్స్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ సినిమాలోని సిచ్యువేషన్ ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. దానికి అర్మాన్ మాలిక్ వాయిస్ అంతే న్యాచురల్ గా మెస్మరైజ్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అల..’ నుండి ఇప్పటికే రిలీజైన 3 సాంగ్స్ సెట్ చేసిన స్టాండర్డ్స్ ని ఈజీగా అందుకుంది ఈ ‘బుట్టబొమ్మ…’ సాంగ్.

తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు ఈ సినిమాకి. త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకుడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వస్తుంది.