Pushpa కొత్త బన్నీని చూస్తారు!

Saturday,December 11,2021 - 11:10 by Z_CLU

పుష్ప‘ సినిమా కోసం బన్నీ కొత్త గెటప్ ట్రై చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ నుండి మొన్నటి ట్రైలర్ వరకూ బన్నీ సినిమాలో ఎంత కొత్తగా కనిపిస్తాడో తెలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు యూనిట్ సినిమాలో కొత్త బన్నీ ని చూస్తారని తన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని గట్టిగా చెప్తున్నారు. రిలీజ్ దగ్గర పడటంతో సినిమాకి పనిచేసిన నటులు , టెక్నీషియన్స్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు.

వారిలో అందరూ ముఖ్యంగా చెప్తోంది అల్లు అర్జున్ గురించే. అవును సినిమాలో బన్నీ గెటప్ మాత్రమే కాదు మాట కూడా కొత్తగా ఉంటుందని , చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగ్స్ అల్టిమేట్ గా ఉంటాయని అంటున్నారు. ఇక సెట్ లో కూడా బన్నీ అందరితో చిత్తూరు యాసలోనే మాట్లాడేవాడని ఇంత తక్కువ టైంలో అంత పర్ఫెక్ట్ గా మాట్లాడటం తమకి కూడా ఆశ్చర్యాన్ని కలిగించందని ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఈ సినిమా కోసం బన్నీ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేసాడని చెప్తున్నారు.

Pushpa ట్రయిలర్ రివ్యూ

ఇప్పటికే టీజర్ , ట్రైలర్ లో బన్నీ చెప్పే డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా “తగ్గేదే లే” అంటూ బన్నీ ని ఇమిటేట్ చేస్తున్నారు. పుష్ప రాజ్ గా కనిపించడం కోసం సుక్కుతో కలిసి బన్నీ  స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కేవలం మాట తీరే కాదు, నడక తీరు కూడా మార్చుకున్నాడు. ఈ పాత్ర కోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి కొత్తగా కనిపిస్తున్నాడు. ఏదేమైనా సినిమా రిలీజ్ తర్వాత పుష్ప రాజ్ పాత్రతో అల్లు అర్జున్ నటుడిగా మరో మెట్టు ఎక్కడం ఖయమనిపిస్తుంది. తను చెప్పుకునే ఐకానిక్ లిస్టు లో పుష్ప రాజ్ ముందుండేలా ఉంది. చూడాలి డిసెంబర్ 17న బన్నీ పుష్ప రాజ్ గా ఎలాంటి మార్క్ క్రియేట్ చేస్తాడో… ఎన్ని ప్రశంసలు అందుకుంటాడో ?

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trendingstories, Gossips, Actress Photos and Special topics