జెర్సీ’ హిందీ రీమేక్ లో హీరో ఫిక్సయ్యాడు...

Monday,October 14,2019 - 12:12 by Z_CLU

‘జెర్సీ’ హిందీలో రీమేక్ కానుంది. ఈ సినిమాని బాలీవుడ్ లో దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ న్యూస్ పాతదే. అయితే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నాడు.

ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న మేకర్స్, సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. అయితే ఇంకో ఎగ్జైటెడ్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాని తెలుగులో తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి, హిందీలో కూడా దర్శకత్వం వహించబోతున్నాడు.

ఆగష్టు 28, 2020 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మేకర్స్, ‘జెర్సీ’ బాలీవుడ్ లో కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన నటించనున్న హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది ఈ సినిమా యూనిట్.