మహేష్ బాబుకోసం న్యూయార్క్ లో వంశీ పైడిపల్లి

Monday,April 30,2018 - 03:28 by Z_CLU

మహేష్ బాబు 25 వ మూవీ ఇంకా సెట్స్ పైకి రాలేదు. కానీ ఈ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమా పనులు అప్పుడే బిగిన్ చేసేశాడు. ఈ సినిమా కోసం లొకేషన్స్ ఫైనల్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ఈ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ K.U. మోహనన్ తో కలిసి న్యూయార్క్ సిటీలోని లొకేషన్స్ ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఆ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

జూన్ లో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఫాస్ట్ పేజ్ లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. మహేష్ బాబుకు ఇది 25 వ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ ఎక్స్ పెక్టే షన్స్ ఉన్నాయి.

 

https://twitter.com/directorvamshi/status/990839903729700864

ఈ సినిమాలో అల్లరి నరేష్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.