ఆ దర్శకుడితో మళ్ళీ ?

Sunday,April 14,2019 - 04:03 by Z_CLU

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి చరణ్ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. గతంలో వంశీతో ‘ఎవడు’ సినిమా చేసాడు మెగా పవర్ స్టార్. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్రతీ సినిమాకు కొత్త దర్శకుడితో పని చేస్తూ వస్తున్న చెర్రీ ఒక్క రాజమౌళితో మాత్రమే రెండో సినిమా చేస్తున్నాడు. జక్కన్న తర్వాత చరణ్ రెండో సినిమా చేయబోతుంది వంశీకే.

ఇటివలే చరణ్ కి ఓ లైన్ వినిపించాడట వంశీ.. లైన్ నచ్చడంతో చరణ్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. మహర్షి రిలీజ్ అవ్వగానే వంశీ ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది. సినిమా  సినిమాకి మధ్య  దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకునే వంశీ ఈ సారి చరణ్ సినిమాకి ఎంత టైం తీసుకుంటాడో..చూడాలి.