మార్చ్ నుండి 'మహేష్ 27'

Sunday,January 26,2020 - 03:02 by Z_CLU

ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి న్యూ యార్క్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ తన తదుపరి సినిమాను ఫైనల్ చేసుకున్న సంగతి తెలిసిందే. టూర్ ఫినిష్ చేసుకొని రాగానే వంశీ పైడిపల్లితో ఫైనల్ డిస్కర్షన్ ఉంటుందట. ఎటులేదన్నా సినిమా సెట్స్ పైకి వచ్చేది మార్చ్ లోనే అని సమాచారం.

ప్రస్తుతం ఆర్టిస్టులతో పాటు లోకేషన్స్ ఫైనల్ చేసుకొనే పనిలో ఉన్నాడు వంశీ. ఇప్పటికే మహేష్ సరసన కియరా అద్వాని ను హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాను మరోసారి దిల్ రాజు నిర్మించనున్నాడని టాక్.